News June 25, 2024
పలమనేరులో సందడి చేసిన ‘వృషభ’ సినీ బృందం

పెద్దపంజాణి మండలం ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో ‘వృషభ’ సినిమా షూటింగ్ సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది. చిత్రంలో నటించిన పలువురు జూనియర్, సీనియర్ నటులను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. కాగా పలమనేరు నియోజకవర్గంలో గత కొన్నిరోజుల నుంచి వరుస షూటింగ్లు జరుగుతుండడంతో సందడి నెలకొంది. నిర్మాత ఉమాశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. పలమనేరులో లొకేషన్స్ బాగుంటాయని కితాబు ఇచ్చారు.
Similar News
News February 8, 2025
చౌడేపల్లి: ప్రమాదం జరిగితే గానీ స్పందించరా..?

చౌడేపల్లి సోమల మార్గంలోని డ్యాం వద్ద రోడ్డు ప్రమాదకరంగా మారింది. రోడ్డు మధ్యలో కల్వట్టు కుంగడంతో గుంత ఏర్పడింది. వాహనదారులు ఆదమరిస్తే పెను ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగితే గానీ స్పందించరానంటూ ప్రజలు ప్రయాణికులు అధికారులు తీరుపై మండిపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
News February 8, 2025
చిత్తూరు: రైలులో గర్భిణిపై అత్యాచారయత్నం

రైలులో గర్భిణిపై ఓ యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాలు.. తమిళనాడుకు చెందిన జోసెఫ్ భార్య 4నెలల గర్భిణి. ఆమె కోయంబత్తూరు- TPT ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎక్కి పుట్టినిల్లు చిత్తూరు సమీపంలోని మంగసముద్రానికి బయలు దేరింది. వేలూరు జిల్లాకు చెందిన హేమరాజ్(28) మహిళా బోగిలో ఎక్కి ఆమె ఒంటరిగా ఉండడంతో అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి రైలు నుంచి బయటకు తోసేశాడు.
News February 8, 2025
పవన్‌పై అభిమానం.. విజయవాడకు పయనం

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో చిత్తూరు యువకుడు సాహసానికి శ్రీకారం చుట్టాడు. శాంతిపురం మండలం కోలాల తిమ్మనపల్లె గ్రామానికి చెందిన జనసైనికుడు బాలకృష్ణ పుట్టుకతో దివ్యాంగుడు. పవన్‌కు అతను వీరాభిమాని. ఎలాగైనా అతడిని కలవాలన్న ఉద్దేశంతో మూడు చక్రాల సైకిల్‌పైనే విజయవాడకు పయనమయ్యాడు.