News February 6, 2025
పలమనేరు: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

పలమనేరులో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గంటావూరుకు చెందిన షౌకత్ అల్లి అనే వ్యక్తి ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను లారీ డ్రైవర్గా పనిచేస్తాడు. గత కొంతకాలంగా అప్పువాళ్లు వచ్చి ఇంటిముందు అడుగుతుండడంతో ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి హాస్పిటల్ తీసుకొని వెళ్లేసరికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Similar News
News December 17, 2025
సమావేశానికి హాజరైన చిత్తూరు కలెక్టర్

జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు అమరావతిలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హాజరయ్యారు. కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పని చేయాలని, ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులే కీలకమని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని ఆదేశించారన్నారు.
News December 17, 2025
22న మామిడి రైతుల చలో కలెక్టరేట్

చిత్తూరు: మామిడి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 22న చలో కలెక్టరేట్ నిర్వహించనున్నట్లు రైతు సంఘం నాయకులు తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో మామిడి రైతు సంఘ విస్త్రృతస్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు మునీశ్వర్ రెడ్డి, మురళి ప్రసంగించారు. జిల్లాలోని 40వేల మంది రైతులకు రూ.360 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రైతుల అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.
News December 16, 2025
చిత్తూరు: నూతన పోలీసుకు SP సూచనలు.!

చిత్తూరు జిల్లాలో ఎంపికైన పోలీసు కానిస్టేబుల్లు వారికి కేటాయించిన శిక్షణ కేంద్రాల్లో 22వ తేదీ నుంచి వచ్చే నెల 9 నెలల ఇండక్షన్ శిక్షణ పొందవలసి ఉందని SP తుషార్ డూడీ తెలిపారు. ఎంపికైన వారు 20వ తేదీ ఉ.9 గం.లకు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్కు రావాలన్నారు. వచ్చేటప్పుడు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ బుక్, 6 ఫొటోలు, రూ.100 బాండ్తో హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ శిక్షణ 9 నెలలు ఉండనుంది.


