News March 21, 2025

పలమనేరు: నూతన అధ్యక్షుడిగా శ్యాం ప్రసాద్ రెడ్డి

image

పలమనేరు రెవెన్యూ డివిజన్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా సోమల తహశీల్దార్ శాంప్రసాద్ రెడ్డి ఎంపికయ్యారు. పలమనేరులో రెవెన్యూ ఉద్యోగుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. డివిజనల్ గౌరవ అధ్యక్షుడిగా మాధవ రాజు, ఉపాధ్యక్షుడిగా యోగానంద్, మోహన్ రెడ్డి, తహసీన, జనరల్ సెక్రటరీగా అనిల్ కుమార్, మరికొందరిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.

Similar News

News March 25, 2025

ఈసారైనా రామకుప్పం ఎంపీపీ ఎన్నిక జరిగేనా?

image

రామకుప్పం మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటికే ఎంపీపీ ఎన్నిక 5 సార్లు వాయిదా పడింది. మొత్తం 15 మంది MPTCలకు గాను వైసీపీకి చెందిన సుమారు 7 మంది ఎంపీటీసీలు టీడీపీ కండువా కప్పుకున్నారు. కాగా ఈ ఎన్నికను టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. వైస్ ఎంపీపీ పదవికి ఇరు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ఈసారైనా ఎన్నిక జరుగుతుందా లేదా వేచి చూడాల్సిందే.

News March 25, 2025

నాగలాపురం: బాలికపై అత్యాచారం.. కేసు నమోదు

image

ఉ.చిత్తూరు(D) నాగలాపురం(M)లోని ఓ కాలనీలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో చరణ్(23)పై కేసు నమోదు చేసినట్లు SI సునీల్ కుమార్ తెలిపారు. నిందితుడు పెళ్లి చేసుకుంటానని బాలికను నమ్మించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.

News March 25, 2025

చిత్తూరు: మెగా డీఎస్సీకి ఉచిత శిక్షణ

image

మెగా డీఎస్సీ పరీక్షకు హాజరయ్యే బీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులకు ఆన్‌లైన్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఇందుకోసం మార్చి 10 నుంచి దరఖాస్తులను బీసీ సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. దరఖాస్తుతోపాటు సంబంధిత సర్టిఫికెట్లను అందజేయాలన్నారు.

error: Content is protected !!