News February 17, 2025
పలమనేరు: బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన విద్యార్థిని

విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చి తాను కన్నుమూసిన ఘటన పలమనేరులో చోటు చేసుకుంది. మండలంలో ఓ బాలిక(16) ప్రభుత్వ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈక్రమంలో విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. పురిటి నొప్పులు అధికమవడంతో బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యుల సిఫార్సుతో చిత్తూరుకు తరలించారు. రక్తస్రావం అధికమవడంతో శిశువుకు జన్మనిచ్చి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
Similar News
News April 17, 2026
బాల, బాలికలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించండి: కలెక్టర్

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘బడి పిలుస్తోంది’ ప్రత్యేక ప్రవేశోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈనెల 17 నుంచి 23 వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అర్హత గల బాల, బాలికలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. స్లమ్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News April 17, 2026
గంగ జాతరకు CM చంద్రబాబుకు ఆహ్వానం

కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు సతీసమేతంగా రావాలంటూ CM చంద్రబాబుకు గంగమ్మ గుడి ఛైర్మన్ BMK రవిచంద్రబాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. అమరావతిలో CMను ఆయన నివాసానికి వెళ్లి జాతర ఆహ్వాన పత్రిక ఇచ్చారు. గంగ జాతరలో భాగంగా మే 20న అమ్మవారి విశ్వరూప దర్శనం రోజు CM చంద్రబాబు దంపతులు రానున్నట్లు సమాచారం.
News April 17, 2026
612 కేసులు నమోదు: చిత్తూరు SP

విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ హెచ్చరించారు. 2025 జనవరి 1 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 612 కేసులు నమోదు చేసి రూ. 69,500 జరిమానా విధించినట్టు ఆయన శుక్రవారం వెల్లడించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలో సిగరెట్లు, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తులు విక్రయించరాదన్నారు.


