News August 9, 2024

పలమనేరు మాజీ ఎమ్మెల్యే పై చీటింగ్ కేసు

image

పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడపై గురువారం చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మాదిగబండ సమీపంలోని తన క్వారీలో ఈనెల 6వ తేదీ రాత్రి మూడు టిప్పర్లు, రెండు హిటాచీలు, ఒక ఎక్స్కవేటర్‌ను మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ తీసుకెళ్లిపోయారంటూ జనార్దన నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు వెంకటేగౌడపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News November 20, 2025

వివాదస్పదంగా కొందరు విలేకరుల తీరు.!

image

చిత్తూరు జిల్లాలో కొందరు <<18340244>>విలేకరులు దందాలకు<<>> పాల్పడుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఇద్దరు విలేకరులు అగ్రికల్చరల్ మహిళా ఆఫీసర్‌ను బెదిరించగా కలెక్టర్ వారి అక్రిడిటేషన్ రద్దు చేశారు. తాజాగా GDనెల్లూరు సైతం ఇద్దరు విలేకరులు తనను బెదిరించారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ప్రజలకు అండగా ఉండాల్సిన విలేకరులే ఇలా అడ్డదారులు తొక్కుతుంటే ఎలా అని పలువురు మండిపడుతున్నారు.

News November 20, 2025

క్షణికావేశంలో ఆత్మహత్యలు.. ఒక్కసారి ఆలోచించండి.!

image

అల్లారుముద్దుగా చూసుకున్న కూతురు పట్టాలపై <<18338200>>మాంసపు ముద్దలా<<>> మారిన వేళ.. బుడిబుడి నడకలు, చిలిపి చేష్టలకు సంబరపడ్డ తల్లిదండ్రులు తెగిపడ్డ తమ బిడ్డ శరీర భాగాలను చూసి తట్టుకోగలరా? కుప్పం(M)లో అనూష.. పేరంట్స్ మందలించారని తనువు చాలించింది. చిన్న చిన్న కారణాలకు ఎంతో మంది క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి విద్యార్థి దశలోనే కౌన్సెలింగ్‌ ఇస్తే ఇలాంటివి జరగవని పలువురు అంటున్నారు.

News November 20, 2025

చిత్తూరు: విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.1.66 కోట్లు మంజూరైంది. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల కింద ఈ నగదు చెల్లిస్తామని జిల్లా సమగ్రశిక్ష శాఖ ఏపీసీ వెంకటరమణ తెలిపారు. ఏడాదికి రూ.6వేలు చొప్పున మొదటి విడతగా జిల్లాలో 5,553 మందికి 5నెలలకు రూ.1.66 కోట్లు జమ చేశామన్నారు.