News April 28, 2024

పలమనేరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. గంగవరం మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన జీవరత్నం తన భార్యతో కలిసి పలమనేరు నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా పలమనేరు వైపు వస్తున్న లగేజ్ ఆటో కంచిరెడ్డిపల్లి జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో జీవరత్నం అక్కడికక్కడే మృతి చెందగా.. ఆయన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను పలమనేరు ఆసుపత్రికి తరలించారు.

Similar News

News November 6, 2024

తిరుమల: భక్తులతో కలిసి భోజనం చేసిన టీటీడీ ఛైర్మన్

image

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. అనంతరం భక్తులతో భోజనం చేశారు. అన్నప్రసాదం కార్యక్రమాల గురించి డీవైఈవోతో సమీక్షించారు.

News November 6, 2024

కుప్పం: కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరు

image

కుప్పం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి YCP కౌన్సిలర్లు గైర్హాజరు అయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులకు సంబంధించి వైసీపీ 19 వార్డుల్లో గెలుపొందగా 6 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. ఇటీవల ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి టీడీపీలో చేరిన ఐదుగురు, టీడీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. YCPకి చెందిన 14 మంది సమావేశానికి గైర్హాజరయ్యారు.

News November 6, 2024

తిరుపతి: ఎర్రచందనం కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ : SP

image

ఎర్రచందనంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో ఎర్రావారిపాలెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చలమకుంట గురప్ప అరెస్ట్ అయ్యాడు. కేసులో ఆయన ప్రమేయంతో పాటు కేసులో ఉన్న ముద్దాయిలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కానిస్టేబుల్, A4 ముద్దాయికి మధ్య సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అవడంతో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.