News October 13, 2024

పలమనేరు : 17న జాబ్ మేళా

image

APSSDC ఆధ్వర్యంలో 17వ తేదీన పలమనేరు పట్టణంలోని SVCR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చిత్తూరు జిల్లా నైపుణ్య అభివృద్ధి శాఖ అధికారి గుణశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 2 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, బి ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. స్థానిక, పరిసర ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News October 18, 2025

శాంతిపురం : రోడ్డు ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్

image

శాంతిపురం (M) బడుగుమాకులపల్లి వద్ద బైకును కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కెనమాకులపల్లికి చెందిన వెంకటరామప్ప (55), సత్యప్ప (60) బైకుపై బడుగు మాకులపల్లి వైపు వెళ్తుండగా ఎదురుగా పలమనేరు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకట రామప్ప అక్కడికక్కడే మృతిచెందగా, సత్యప్ప తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించారు.

News October 18, 2025

చిత్తూరు: ఈ నెల 21న హాలిడే కోసం వినతి

image

ఈ నెల 20న దీపావళి పండుగ సందర్భంగా మరుసటి (మంగళవారం) పాఠశాలలకు సెలవు ప్రకటించాలని APTF నాయకులు విద్యాశాఖాధికారులకు విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖ కార్యాలయంలో AD సుకుమార్‌ను కలిసిన APTF నాయకులు ఆరోజు పలువురు కేదారేశ్వర స్వామి వ్రతం నిర్వహించుకుంటారని, కావున సెలవు ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుుంటారో వేచి చూడాలి.

News October 18, 2025

హంద్రీనీవాతో కుప్పం సస్యశ్యామలం

image

హంద్రీనీవాతో కుప్పం ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్సీ కంచర శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. శాంతిపురం (M) దండి కుప్పం చెరువు కృష్ణ జలాలతో నిండి మరవ పోవడంతో శుక్రవారం టీడీపీ నేతలు జల హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కుప్పంకు కృష్ణా జలాలను తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు మరో భగీరథ ప్రయత్నం చేశారన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు జేజేలు పలుకుతూ నినాదాలు చేశారు.