News December 16, 2024

పలాసలో బీహార్ గ్యాంగ్‌పై మంత్రి అచ్చెన్న సీరియస్

image

పలాసలో టీడీపీ నేతను హత్య చేసేందుకు బీహర్ ముఠా వేసిన పన్నాగంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా హత్య రాజకీయాలకు ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. దీని వెనుక ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా శిక్షించాలన్నారు.

Similar News

News December 6, 2025

SKLM: వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదు

image

రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణీ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ సర్వజనీన ఆసుపత్రిలో శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం సుమారుగా 7 నెలలు కావస్తున్నా వేతనాలు చెల్లించడం లేదన్నారు.

News December 6, 2025

శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

image

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.

News December 6, 2025

శ్రీకాకుళం: టెట్ ఎగ్జామ్ సెంటర్‌లు ఇవే

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఈ నెల 10-21 వరకు జరగనుంది. జిల్లాలో సుమారు 12 వేల పైచిలుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. వీరికి ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
✦ఎగ్జామ్‌కు శ్రీకాకుళం జిల్లాలో కేటాయించిన కేంద్రాలు ఇవే:
➤ నరసన్నపేట-కోర్ టెక్నాలజీ
➤ఎచ్చెర్ల-శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల