News January 12, 2026

పలాసలో భయపెట్టిస్తున్న గన్ కల్చర్‌

image

పలాస‌లో మరోసారి గన్ కల్చర్‌తో అలజడి రేగింది. ఈనెల 9న పలాస రైల్వే టూ వీలర్ పార్కింగ్ స్థల టెండర్ విషయంలో గన్, కత్తులతో కొందరు బెదిరింపులకు పాల్పడగా పోలీసులు అరెస్ట్ చేశారు. 2024 NOVలో ఓ టీడీపీ నేత హత్యకు గన్స్‌తో వచ్చిన సుపారీ గ్యాంగ్ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలు 1978-80ల నాటి క్రైమ్‌ను ప్రజలకు గుర్తు తెస్తున్నాయి. అప్పట్లోనూ నాటు తుపాకులు, కత్తులతో దాడులు చేసి ముగ్గురిని హతమార్చారు.

Similar News

News April 20, 2026

శ్రీకాకుళం: పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానం

image

పద్మ పురస్కారాలకి నామినేషన్ల ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 31 వరకు ఆన్‌లైన్‌లో వివరాలు https://awards.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు, నిస్వార్థ సేవకుల నుంచి 2027 సంవత్సరపు ‘పద్మ’ పురస్కారాలకు ప్రతిపాదనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫెయిలైన వారికి గమనిక

image

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ ఏడాది ఫీజుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమైనట్లు శ్రీకాకుళం ఆర్ఐఓ ఆర్. సురేశ్ కుమార్ తెలిపారు. ఈ నెల 27 లోపు ఫీజులు చెల్లించాలన్నారు. ఫెయిలైన వారు, మొదటి ఏడాది, రెండో ఏడాది ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ద్వితీయ సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాసేందుకు ఈ ఏడాది కొత్తగా అవకాశం కల్పించినట్లు చెప్పారు.