News May 24, 2024

పలాసలో 40 తులాల బంగారం చోరీ

image

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రోటరీనగర్‌లో తెల్లవారుజామున ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. NREGSలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అలివేణి అనే మహిళ తన స్వగ్రామానికి వెళ్లగా, ఇదే అదనుగా భావించి దోచేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.18 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 4, 2025

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు అలర్ట్

image

రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు అయ్యాయి. వీటిని రీ షెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ బుధవారం పేర్కొంది. హౌడా-సికింద్రాబాద్(12703), చెన్నై-హౌడా (12840) ఎక్స్‌ప్రెస్‌లు డిసెంబర్ 4, 8, 9, 10,11 తేదీల్లో నిర్ణీత సమయం కంటే 2 గంటలు ఆలస్యంగా నడుస్తాయని ఆ శాఖ జీఎం పరమేశ్వర్ తెలిపారు.

News December 4, 2025

మూలపేట పొర్టు నిర్మాణంపై అప్‌డేట్

image

టెక్కలి నియోజకవర్గం మూలపేట పోర్టు నిర్మాణం జాప్యం అవుతోంది. దీని వ్యవధిని 2026 నవంబర్‌కు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 2949.70 కోట్లతో విశ్వసముద్ర పోర్టు కాంట్రాక్ట్ సంస్థ పనులను 2023 ఏప్రిల్‌లో ప్రారంభించింది. కాంట్రాక్టర్ గడువు ఈ ఏడాది అక్టోబర్ 17తో ముగిసింది. పెండింగ్ పనుల దృష్ట్యా కట్టడాల కాలపరిమితిని పెంచుతూ తాజాగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News December 4, 2025

ఎచ్చెర్ల: రిజల్ట్స్ వచ్చాయి

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్ సైట్‌ https://brau.edu.in/లో పొందుపరిచామన్నారు. 95 మందికి 84 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.