News May 24, 2024

పలాసలో 40 తులాల బంగారం చోరీ

image

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రోటరీనగర్‌లో తెల్లవారుజామున ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. NREGSలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అలివేణి అనే మహిళ తన స్వగ్రామానికి వెళ్లగా, ఇదే అదనుగా భావించి దోచేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.18 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News February 10, 2025

టెక్కలి: లారీ డ్రైవర్‌కు INCOME TAX నోటీసు

image

టెక్కలి మండలం చల్లపేట గ్రామానికి చెందిన చల్లా నాగేశ్వరరావుకు రూ.1,32,99,630 కోట్లు ఆదాయ పన్ను కట్టాలని నోటీసులు వచ్చినట్లు బాధితుడు వాపోయారు. తనకు ఏడాదికి సుమారు రూ.3.97కోట్లు ఆదాయం వస్తున్నట్లు పేర్కొంటూ నోటీసు వచ్చిందన్నారు. ఈ మేరకు ఆదివారం బాధితుడి న్యాయం చేయాలని టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు, తన సోదరుడికి ఆస్తి గొడవలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 10, 2025

పలాస: దివ్యాంగురాలిపై అత్యాచారం.. కేసు నమోదు

image

శ్రీకాకుళం జిల్లా పలాస మండల పరిధిలోని ఓ గ్రామంలో ఇటీవల ఓ దివ్యాంగురాలు గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తిపై ఆదివారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆ గ్రామ పెద్దల సమక్షంలో శీలానికి వెల కట్టిన వ్యవహారం పలు పత్రికల్లో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ తెలిపారు.

News February 10, 2025

శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్

image

ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 114 కేంద్రాల్లో ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 20వ తేదీ వరకు విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు కలిపి 164 ఉండగా ప్రాక్టికల్స్ పరీక్షలకు 15వేలు పైచిలుకు విద్యార్థులు హాజరుకానున్నారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు హాజరుకానున్నారు.

error: Content is protected !!