News February 5, 2025
పలాస: అబాకస్‌లో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

పలాస మండలం రామకృష్ణాపురంలో గల ఒక ప్రైవేట్ పాఠశాల విద్యార్థిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందని ప్రిన్సిపల్ ప్రీతి చౌదరి మంగళవారం తెలిపారు. 5వ తరగతి చదువుతున్న గీత చరిష్మా శ్రీకాకుళంలో జరిగిన జిల్లాస్థాయి అబాకస్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచింది. త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ప్రిన్సిపల్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తేవాలని టీచర్స్ కోరారు.
Similar News
News February 18, 2025
జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.
News February 18, 2025
టెక్కలిలోని హాస్టళ్లలో నిఘా కరవు

టెక్కలిలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో ఓ ఇంటర్ విద్యార్థిని గర్భం దాల్చిందన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలికల హాస్టళ్లలో అధికారుల పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వార్డెన్లు, సిబ్బందితో పాటు విద్యార్థినుల రాకపోకలను గమనించడం లేదని , అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
News February 18, 2025
టెక్కలి : ప్రభుత్వ హాస్టళ్లో గర్భం దాల్చిన విద్యార్థిని

టెక్కలిలోని ఓ ప్రభుత్వ బాలికల వసతిగృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థినికి టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ప్రసూతి వైద్య పరీక్షలు నిర్వహించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని గర్భం దాల్చిందనే ప్రచారం సోమవారం నాటికి బయటకు పొక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.