News November 26, 2024

పలాస: ఉరేసుకుని జవాన్ భార్య ఆత్మహత్య

image

పలాస మండలం ఈదురాపల్లిలో మీరజాక్షి (21) అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మెళియాపుట్టి(M) టకోయిగాతలవలస గ్రామానికి చెందిన మీరజాక్షికి 7 నెలల క్రితం ఈదురాపల్లి చెందిన జవాన్ వినోద్‌తో వివాహమైంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారం క్రితం ఇదే గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ జవాన్ భార్య సూసైడ్ చేసుకున్నారు.

Similar News

News February 22, 2026

శ్రీకాకుళం: రాజకీయ దురంధరుడు ‘బొడ్డేపల్లి’

image

బొడ్డేపల్లి రాజగోపాలరావు (1923-1992) శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాంగ్రెస్ దిగ్గజ నాయకుడు. ఆరుసార్లు ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించిన ప్రజా నాయకుడు. 1952-1984 మధ్య కాలంలో ఆరుసార్లు (1, 2, 3, 5, 6, 7వ లోక్‌సభలు) శ్రీకాకుళం ఎంపీగా బాధ్యతలు నిర్వహించారు. వంశధార ప్రాజెక్టు, ఆమదాలవలస షుగర్ ఫ్యాక్టరీ వంటి పలు అభివృద్ధి పనులకు ఆయన కారకులు. కాలింగ జాతికి ముద్దు బిడ్డ అని పిలుస్తారు. ఈరోజు ఆయన 34వ వర్ధంతి.

News February 22, 2026

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాటు

image

జిల్లాలో సోమవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఆర్. సురేష్ కుమార్ చెప్పారు. 71 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామన్నారు. 39,838 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని అన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. 71 మంది చీప్ సూపరింటెండెంట్లు, 831 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు.

News February 22, 2026

శ్రీకాకుళం: నకిలీ పాసుల కేసు తీవ్ర జాప్యం!

image

ఆదిత్యుని ఆలయంలో జరిగిన రథసప్తమి వేడుకల్లో నకిలీ వీఐపీ పాసులు కేసును సీసీఎస్, టాస్క్ ఫోర్స్ పోలీసులు తొలుత దర్యాప్తు చేశారు. అనంతరం మొదటి పట్టణ స్టేషన్ పోలీసులకు కేసు అప్పగించారు. దాదాపుగా నకిలీ పాసులు వ్యవహారంలో సంబంధం ఉన్న వారిని గుర్తించారు. అయితే ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రాజకీయ మద్దతు ఉండటం కేసు జాప్యానికి కారణమనే చర్చ నడుస్తోంది.