News October 16, 2024
పలాస: టీడీపీ సానుభూతిపరులపై దాడి

పలాస నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరులపై దాడి జరగ్గా పలువురు గాయపడ్డారు. బాధితుల వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలి గ్రామానికి చెందిన గంగయ్య గతంలో టీడీపీ కోసం పనిచేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గ్రామానికి చెందిన కొందరు వైసీపీ కార్యకర్తలు గంగయ్యతో పాటు ఆయన భార్యపై దాడి చేశారు. అడ్డుకున్న కుమారుడు గిరిపై కూడా దాడి చేయడంతో గాయపడ్డారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 5, 2025
శ్రీకాకుళం: పోలీసుల తనిఖీల్లో..శిక్షలు వీరికే

శ్రీకాకుళం జిల్లాలో గత నాలుగు రోజుల క్రితం పోలీసుల తనిఖీల్లో పట్టుపడిన వారికి శిక్షలు పడ్డాయి. డ్రంక్&డ్రైవ్ రూ.10వేలు, బహిరంగ మద్యం కేసుల్లో రూ.1000ల జరిమానా కోర్టు విధించిందని SP కేవీ మహేశ్వరెడ్డి నిన్న తెలిపారు. సోంపేట-3, బారువా-1, పలాస-16, టెక్కలి-3, మెళియాపుట్టి-9, డ్రంక్&డ్రైవ్-నరసన్నపేటలో ఒకరికి రూ.2,500, మరొకరికి రూ.5000లు ఫైన్ వేశారు. ఆమదాలవలస, సారవకోట-ఇద్దరికి 5 రోజుల జైలు శిక్ష పడింది.
News December 5, 2025
నాకు బతకాలని లేదు: శ్రీకాకుళం యువతి సూసైడ్

విజయనగరం బీసీ హాస్టల్‌లో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు..VZM మహారాజ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న స్వాతి ఈ బలవన్మరణానికి పాల్పడింది. ఆమెది శ్రీకాకుళం(D)శ్రీకూర్మంగా పోలీసులు గుర్తించారు. తన డైరీలోని ఓ పేజీలో ‘అమ్మ.. నాన్నా నాకు బతకాలని లేదు. ఎందుకో భయమేస్తోంది. నేను ఏ తప్పు చేయలేదు’ అని స్వాతి రాసిన సూసైడ్ నోట్ బయటపడింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 4, 2025
SKLM: ‘ప్రజలు సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత’

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సైతం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడంపైనే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. సచివాలయం నుంచి గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీఎం కుసుమ పథకం కింద ఉన్న భూమి వివాదాలు, ఎరువులు సరఫరా లోపాలు, పెన్షన్ల పంపిణీలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్నారు.


