News September 17, 2024

పలాస: దుస్తులు చించి ఆశా వర్కర్‌పై దాడి?

image

పలాస(M) లక్ష్మీపురం(P) కిష్టుపురంలో ఆశా వర్కర్‌ బూర్లె కృష్ణవేణిపై సోమవారం రాత్రి దాడి జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన లలితమ్మ జ్వరానికి, బీపీకి మాత్రలు కావాలని కోరారు. జ్వరానికి మాత్రలు ఇచ్చి.. బీపీకి డాక్టర్లే చెక్ చేసి ఇస్తారన్నారు. దీంతో లలితమ్మ భర్త కృష్ణారావు, ఆమె కుమారుడు మోహన్ కృష్ణవేణిపై దాడి చేశారు. తన నైటీని కూడా చించేశారంటూ సీఐ మోహనరావుకు ఆమె ఫిర్యాదు చేశారు.

Similar News

News October 16, 2024

నీటి తీరువా వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలి: కలెక్టర్

image

సాగనీటి సంఘాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నందున నీటి తీరువా వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన పనులు వేగవంతం చేయడంతో పాటు పనిదినాలు జనరేట్ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్లో మంగళవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

News October 15, 2024

KGBVల్లో నాన్ టీచింగ్ పోస్టుల దరఖాస్తుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కేజీబీవీల్లో నాన్ టీచింగ్ పోస్టులు దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారంతో గడువు ముగుస్తుంది. ఈ మేరకు మొత్తం జిల్లాలో 36 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు నేటి సాయంత్రంలోగా ఆయా మండలాల్లో ఉన్న ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి వేతనంగా నెలకు రూ.15,000 చెల్లించనున్నారు. కనీస వయస్సు 21 నుంచి 42 మధ్యలో ఉండాలి.

News October 15, 2024

శ్రీకాకుళం: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

image

15 సంవత్సరాలు నిండిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. వయోజన విద్యపై కలెక్టర్ ఛాంబర్‌లో మంగళవారం ఆయన సమీక్షించారు. ఉల్లాస్ అనే కార్యక్రమం ద్వారా ప్రధానంగా స్వయం సహాయక సంఘాల లబ్ధిదారులు, ఆయాలు, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే నైట్ వాచ్ మన్‌లు, తదితరులు దృష్టి సారించాలన్నారు.