News January 22, 2025
పలాస: పశువుల పాక కన్నా ఘోరంగా అంగన్వాడీ కేంద్రం
శ్రీకాకుళం జిల్లా పలాస మండల ఎంపీపీ గ్రామమైన మోదుగులపుట్టి గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రం పశువుల పాక కన్నా అధ్వానంగా ఉంది. కనీసం తలుపులు (తడకలు) లేకుండా ఇరుకైన ప్రదేశంలో ఐదుగురు చిన్నారులు ఇక్కడ చదువుతున్నారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో వీరితోపాటు ముగ్గురు గర్భిణీలు, ఇద్దరు బాలింతలు వస్తూ ఉంటారు. అదే ఇరుకైన గదిలో వంట సామగ్రితో పాటు నాడు-నేడు సామగ్రి కూడా అక్కడే భద్రపరిచారు.
Similar News
News January 22, 2025
SKLM: ‘పెండింగ్ కేసులు వేగవంతం చేయాలి’
అపరిష్కృతంగా ఉన్న (క్రైమ్ అగైనెస్ట్) మహిళలు, చిన్నారులపై జరిగే కేసులు, హిట్ అండ్ రన్ కేసులపై దృష్టి కేంద్రీకరించి, వేగవంతంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఎస్పీ శ్రీ కేవీ.మహేశ్వర రెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ జూమ్ కాన్ఫెరెన్స్ ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ వెల్లడించారు.
News January 22, 2025
శ్రీకాకుళం: ఏంటి ఈ హెలికాప్టర్ టూరిజం..!
అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ టూరిజం డచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ వద్ద నిర్వహిస్తారు. అయితే ఇందులో ఆరుగురు మంది వరకు ట్రావెల్ చేయవచ్చు. దీనికి రూ.2వేలు వరకు ప్రతి ఒక్కరికి ఛార్జ్ ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు మూడు రోజులు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 22, 2025
రణస్థలం: బాలికపై యువకుడి అఘాయిత్యం
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన రణస్థలం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. జె.ఆర్ పురం ఎస్.ఐ చిరంజీవి తెలిపిన వివరాల మేరకు బాలిక వ్యవహార శైలిలో మార్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. ఎన్. ప్రసాద్ అనే యువకుడు బాలికను గ్రామ సమీపంలోని భవనంపైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి, ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.