News June 20, 2024
పలాస పాసింజర్ గమ్యం కుదింపు
పూండి-నౌపడా సెక్షన్ మధ్యలో జరుగుతున్న భద్రత పనుల దృష్ట్యా నేడు పలాన పాసింజర్ గమ్యం కుదించినట్లు అధికారులు తెలిపారు. పలాస-విశాఖపట్నం (07471) పాసింజర్ స్పెషల్ గురువారం పలాస నుంచి కాకుండా శ్రీకాకుళం రోడ్ నుంచి బయల్దేరనుంది. అలాగే విశాఖపట్నంలో బయల్దేరే విశాఖపట్నం-పలాస(07470) పాసింజర్ స్పెషల్ పలాస వరకు కాకుండా శ్రీకాకుళం రోడ్ వరకు మాత్రమే నడుస్తుంది.
Similar News
News September 11, 2024
SKLM: నది కాలువలో ఒకరు మృతి
నీట మునిగి ఒకరు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామ సమీపంలోని వంశధార కుడి కాలువలో స్నానం చేయడానికి గుండ చంద్రుడు(44) బుధవారం వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఎస్ఐ వెంకటేశ్ మృతదేహాన్ని పరిశీలించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.
News September 11, 2024
శ్రీకాకుళం: ప్రకృతి వైపరీత్యాలలో బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సమాజ ఆర్థికాభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతైనా అవసరం అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC), బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఇటీవలీ వరదల వల్ల నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. సహయార్థం తమ వంతు బాధ్యత వహించాలన్నారు.
News September 11, 2024
శ్రీకాకుళం: ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీలో స్పాట్ అడ్మిషన్లు
శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాలలో ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీలో మిగిలి సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం.ప్రదీప్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జీవశాస్త్రం సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అన్నారు. వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.