News March 23, 2024
పలాస: బొడ్డపాడు ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

బొడ్డపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పోతనపల్లి సరోజవర్మ విధుల నుంచి తప్పించినట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకులు జి.వి.చిట్టి రాజు తెలిపారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భరత్ నాయక్ ఉల్లంఘించినట్లు స్పష్టం చేశారు. దీంతో అతని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News April 5, 2026
నరసన్నపేట: కల్తీ ఆహారంపై కనికరమేల..?

నరసన్నపేటలో నాణ్యతలేని ఆహార విక్రయాలు భారీగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మిల్క్ షేక్, హోటల్స్, స్వీట్ స్టాల్స్, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ అమ్మకాలలో నాణ్యతా ప్రమాణాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇటీవల సింగపురంలో జరిగిన కల్తీ బాదంపాలు ఘటన అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.
News April 5, 2026
సింగిపురం: 113కి చేరిన కల్తీ బాదంపాల బాధితుల సంఖ్య

శ్రీకాకుళం రూరల్ మండలం సింగిపురం జాతరలో కల్తీ బాధంపాలు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు, విరోచనాలతో శుక్రవారం సుమారు 80 మంది పీహెచ్సీలో చేరగా.. శనివారంనాటికి కేసులు 113కు పెరిగాయి. ప్రస్తుతం బాధితులకు స్థానిక పీహెచ్సీలో వైద్య సిబ్బంది పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అధికారులు ఘటనపై విచారణ ప్రారంభించారు.
News April 5, 2026
గార: 80 ఏళ్లలో మరొకరికి వెలుగునిచ్చిన భార్యాభర్తలు

గార మండలంలోని శ్రీకూర్మానికి చెందిన అంధవరపు రూపవతి(82) శుక్రవారం తనువుచాలించారు. దీంతో కుటుంబ సభ్యులు నేత్రదానం చేయాలని నిర్ణయించుకున్నారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ టెక్నీషియన్లు సుజాత, పి.చిన్ని కృష్ణల ద్వారా ఆమె కార్నియాలను సేకరించారు. ఇటీవలే భర్త బాలకృష్ణ మూర్తి (88) కూడా నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచారు.


