News March 23, 2024
పలాస: బొడ్డపాడు ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్
బొడ్డపాడు గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ పోతనపల్లి సరోజవర్మ విధుల నుంచి తప్పించినట్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక సంచాలకులు జి.వి.చిట్టి రాజు తెలిపారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టిన పలాస రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో భరత్ నాయక్ ఉల్లంఘించినట్లు స్పష్టం చేశారు. దీంతో అతని విధుల నుంచి తప్పించినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 4, 2024
ఎల్.ఎన్.పేట: మిల్లుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఎల్.ఎన్.పేట మండలం పెద్దకొల్లివలస సమీపంలోని దమయంతి మోడ్రన్ రైస్ మిల్‌పై నుంచి జారిపడి సాహుకారి వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిల్లుకు సోలార్ ప్లేట్లు వేసేందుకు కొలతలు వేస్తుండగా సిమెంట్ రేకులు పగిలి వెంకటరమణ కిందకు జారిపడి మృతి చెందినట్లు చెప్పారు. మరో వ్యక్తి నాయుడుకు స్వల్ప గాయాలయ్యాయి. సరుబుజ్జిలి ఇన్‌ఛార్జ్ ఎస్ఐ రాజేష్ వివరాలు సేకరిస్తున్నారు.
News November 4, 2024
శ్రీకాకుళం: B.Ed సెమిస్టర్ ఫీజు చెల్లించేందుకు నేడే లాస్ట్
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ బీఈడీ 2వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు గడువు నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా రెగ్యులర్ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30, పరీక్ష ఫీజు 1305తో కలిపి మొత్తం రూ.1335 చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 12వ తేదీ నుంచి హాల్ టికెట్లు కళాశాల యాజమాన్యంకి అందుబాటులోకి రానున్నాయి. 19వ తేదీ నుంచి బీఈడీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయి.
News November 4, 2024
శ్రీకాకుళం: ప్రజా ఫిర్యాదుల వేదికకు 204 ఫిర్యాదులు
మీకోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీలు పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) మీకోసం కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 204 అర్జీలను స్వీకరించామన్నారు.