News August 8, 2024

పలాస: రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

శ్రీకాకుళం జిల్లా పలాస- తుమ్మాదేవి రైల్వే స్టేషన్‌ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ ఐఎస్ కే షరీఫ్ గురువారం తెలిపారు. మృతుడి వయసు సుమారుగా 35 -40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 94406 27567 నంబర్‌ను సంప్రదించాలని ఎస్సై సూచించారు.

Similar News

News December 25, 2025

శ్రీకాకుళం: 9 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

image

ఇచ్ఛాపురంలో ఒక నిత్య పెళ్లికూతురు ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలో ఓ యువతి మరో మహిళ సహాయంతో వరుసగా 8 పెళ్లిళ్లు చేసుకుంది. ఇటీవల వివాహం అనంతరం అనుమానం రావడంతో బాధితుడు ఇచ్ఛాపురం పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నిత్యపెళ్లికూతురుతో పాటు మరో మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం.బరంపురానికి చెందిన ఒక యువకుడిని పెళ్లిచేసుకుని మోసం చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు.

News December 25, 2025

మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

image

ఈనెల 26న మీ చేతికి మీ భూమి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ గత పాలకుల తప్పిదాల వల్ల 22ఏ జాబితాలోకి వెళ్లిన భూముల విషయంలో బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 22ఏ భూములపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

News December 25, 2025

మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు: రామ్మోహన్ నాయుడు

image

మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు ఎంతగానో దోహద పడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమని పంచడమే కిస్మస్ సందేశమని అన్నారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.