News August 8, 2024
పలాస: రైలు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

శ్రీకాకుళం జిల్లా పలాస- తుమ్మాదేవి రైల్వే స్టేషన్‌ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ ఐఎస్ కే షరీఫ్ గురువారం తెలిపారు. మృతుడి వయసు సుమారుగా 35 -40 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తించినట్లయితే 94406 27567 నంబర్‌ను సంప్రదించాలని ఎస్సై సూచించారు.
Similar News
News July 9, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణకు వేళాయె..!

సింహాచలం గిరి ప్రదిక్షిణకు సర్వం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు స్వామి వారి రథం కదలనుంది. 32 కిలోమీటర్ల మేర సాగనున్న ప్రదక్షిణలో సుమారు 5 లక్షలకు పైనే భక్తులు వస్తారని అధికారులు అంచానా వేశారు. తొలిపావంచా నుంచి మొదలయ్యే ప్రదక్షిణ పాత అడివివరం మీదుగా పైనాపిల్ కాలనీ, ముడసర్లోవ, హనుమంతవాక, MVPకాలనీ, సీతమ్మధార, కంచరపాలెం, NAD జంక్షన్, పాత గోశాల కూడలి మీదుగా తిరిగి తొలిపావంచా వద్దకు చేరుకోనుంది.
News July 8, 2025
మినీ జెట్టి మంజూరు చేయాలని కేంద్రమంత్రికి వినతి

కేంద్ర మత్స్య శాఖ మంత్రి లాలన్ సింగ్‌ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం దిల్లీలో కలిశారు. పెద్ద గనగలవానిపేట వద్ద మినీ జెట్టి నిర్మాణానికి, ఫిష్ లాండింగ్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు. మంత్రి అచ్చెంనాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి వినత పత్రం అందజేయడం జరిగిందని శంకర్ తెలిపారు.
News July 8, 2025
శ్రీకాకుళం: హోంగార్డుకు ‘చేయూత’

ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు పి. జగన్నాధంకు ‘చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది స్వచ్ఛంధగా విరాళం ఇచ్చిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు నగదు చెక్కు రూ.4.09 లక్షలను ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. ఉద్యోగ విరమణ అనంతరం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని ఎస్పీ ఆకాంక్షించారు.