News January 17, 2025

పలాస: సముద్ర స్నానానికి వెళ్లి యువకుడు గల్లంతు

image

పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన జంగం తరుణ్(16) శుక్రవారం సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతయ్యాడు. బయటకు రాకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పండగ సెలవులకు సరదాగా గడుపుతున్న సమయంలో ఇలా జరగడం బాధాకరమని స్థానికులు అన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Similar News

News December 4, 2025

శ్రీకాకుళం: ‘గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు’

image

ప్రభుత్వం గ్రామ ప్రగతికి ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. గ్రామ సచివాలయాల అడ్మినిస్ట్రేషన్‌కు డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ (డీడీఓ ) వ్యవస్థను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం రాష్ట్రం యూనిట్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తున్నారు. శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ భాగం ఏర్పాటు చేశారు. డీడీఓగా అరుంధతి దేవిని నియమించారు. జిల్లాలో 657 గ్రామ సచివాలయాలు ఈ పరిధిలోకి వస్తాయి.

News December 4, 2025

‘శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల జాబితా సిద్ధం చేయాలి’

image

జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రాల జాబితాను వారం రోజుల్లో సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దేవాదాయ శాఖ ఈఓలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బంగ్లాలో సమావేశం సంబంధిత అధికారులతో నిర్వహించారు. ఒక్కొక్క దేవాదాయ శాఖ ఈఓ పరిధిలో ఉన్న పుణ్యక్షేత్రాలు ఎన్ని ఉన్నాయి, వాటి చరిత్ర, పురాతనం నుంచి వస్తున్న జాతర చరిత్రలను సిద్ధం చేసి వారం రోజుల్లో జాబితా అందజేయాలన్నారు.

News December 4, 2025

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు అలర్ట్

image

రైల్వే ట్రాక్ మరమ్మతుల కారణంగా ఇటీవల శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు అయ్యాయి. వీటిని రీ షెడ్యూల్ చేసినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ బుధవారం పేర్కొంది. హౌడా-సికింద్రాబాద్(12703), చెన్నై-హౌడా (12840) ఎక్స్‌ప్రెస్‌లు డిసెంబర్ 4, 8, 9, 10,11 తేదీల్లో నిర్ణీత సమయం కంటే 2 గంటలు ఆలస్యంగా నడుస్తాయని ఆ శాఖ జీఎం పరమేశ్వర్ తెలిపారు.