News September 13, 2024

పలాస హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్

image

పలాసలోని కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర గ్రామానికి చెందిన యండమూరి నరసమ్మ(58) జీర్ణాశయంలో ఇబ్బంది ఉందని హాస్పిటల్‌కి వచ్చారు. స్కాన్ చేసి కడుపులో గడ్డ ఉందని గుర్తించారు. స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ కవిటి సాహితీ, మత్తు డాక్టర్ తృప్తి సహాయంతో సుమారు 5 కేజీల బరువున్న గడ్డని తొలగించారు.

Similar News

News October 9, 2024

శ్రీకాకుళం: నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం కావాలి

image

సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం ఆయన జాయింట్ కలెక్టర్ ఫర్మాన్‌తో కలసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులతో చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల వారీగా సాగునీటి సంఘాలకు వచ్చే నెల నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలన్నారు.

News October 8, 2024

టెక్కలి: జ్వరంతో స్టాఫ్ నర్స్ మృతి

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.లక్ష్మీ(35)అనే మహిళ జ్వరంతో మంగళవారం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గత కొద్ది రోజులుగా డెంగీ జ్వరం లక్షణాలతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. మృతురాలిది నందిగం మండలం సుభద్రాపురం. స్టాఫ్ నర్స్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతురాలికి భర్త మాధవరావు, ఇద్దరు కుమార్తెలున్నారు.