News February 22, 2025
పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

బల్దియా పరిధిలోని పలు డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులను GWMC కమిషనర్ డా.అశ్వినీ తానాజీ వాఖేడే శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాజీపేటలో సీసీ రోడ్డు డ్రైన్, రంగంపేటలో సీసీ రోడ్డు డ్రైన్, శివనగర్‌లో సీసీ రోడ్డు, 35వ డివిజన్ ఏసీ రెడ్డి నగర్ కాలనీ సీసీ రోడ్డు, ఉర్సు గుట్ట వద్ద వినాయక నిమజ్జన ప్రాంత పరిశీలించారు. కొనసాగుతున్న పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News October 29, 2025
కోస్గి: డయల్ యువర్ డీఎం సద్వినియోగం చేసుకోవాలి

కోస్గి, నారాయణపేట డిపోల పరిధిలోని ప్రజలు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ లావణ్య బుధవారం ప్రకటనలో అన్నారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు, ప్రయాణికులు సంస్థకు సంబంధించిన సమస్యలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని చెప్పారు. 7382826293 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు.
News October 29, 2025
జగిత్యాల: భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ సూచనలు

తుఫాన్ వల్ల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ SE బి.సుదర్శనం పలు సూచనలు తెలిపారు. వర్షం పడుతున్నప్పుడు తడి ప్రదేశాల్లో, తడిగా ఉన్న చేతులతో స్విచ్‌లు, మీటర్లు, ప్లగ్‌లు లేదా వైర్లు తాకకూడదన్నారు. తెగిపోయిన విద్యుత్ తీగలు కనిపించినప్పుడు దగ్గరికి వెళ్లకుండా, వెంటనే లైన్‌మెన్‌కి లేదా 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
News October 29, 2025
ఇక స్పామ్ కాల్స్‌కు చెక్.. TRAI నిర్ణయం!

ఇన్కమింగ్ కాల్స్ విషయంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. కాలర్ పేరు రిసీవర్ ఫోన్లో ఇకపై డిఫాల్ట్‌గా డిస్ప్లే కానుంది. ఈ మేరకు టెలికం శాఖ ప్రపోజల్‌కు TRAI ఆమోదం తెలిపింది. SIM తీసుకునేటప్పుడు ఇచ్చిన వివరాలను ‘కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్’ ఫీచర్ ద్వారా ప్రదర్శిస్తారు. ఇది అందుబాటులోకొస్తే TrueCaller వంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం ఉండదు. స్పామ్ కాల్స్‌ను అరికట్టడంలో ఇది ఉపయోగపడుతుందని TRAI చెప్పింది.


