News February 22, 2025
పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

బల్దియా పరిధిలోని పలు డివిజన్లలో చేపట్టిన అభివృద్ధి పనులను GWMC కమిషనర్ డా.అశ్వినీ తానాజీ వాఖేడే శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాజీపేటలో సీసీ రోడ్డు డ్రైన్, రంగంపేటలో సీసీ రోడ్డు డ్రైన్, శివనగర్‌లో సీసీ రోడ్డు, 35వ డివిజన్ ఏసీ రెడ్డి నగర్ కాలనీ సీసీ రోడ్డు, ఉర్సు గుట్ట వద్ద వినాయక నిమజ్జన ప్రాంత పరిశీలించారు. కొనసాగుతున్న పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 20, 2025
భారీ ఎన్‌కౌంటర్: 30కి చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లోని అండ్రీ అడవుల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మంది నక్సలైట్లు మరణించారు. ఈ పోరులో డీఆర్‌జీ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు మరణించారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News March 20, 2025
ఏలూరు: విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి

ఏలూరు జిల్లాలో గడిచిన 30 రోజుల్లో 57,481 ఆధార్ కార్డుల నమోదు ప్రక్రియ జరిగిందని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 ఏళ్లలోపు, 15-17 ఏళ్లు ఉన్న విద్యార్థులు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆధార్ అప్డేట్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డంకులు దూరమవుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి ఉన్నారు.
News March 20, 2025
NRPT: బడ్జెట్ పత్రాలు దహనం చేసిన నేతలు

బడ్జెట్‌లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించారని నిరసన వ్యక్తం చేస్తూ గురువారం నారాయణపేట నర్సిరెడ్డి చౌరస్తాలో PDSU నాయకులు బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ మాట్లాడుతూ.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 7.57శాతం నిధులు కేటాయించారని, ఇది విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర అని అన్నారు. కనీసం 30 శాతం నిధులు కేటాయించి విద్యపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.