News February 7, 2025
పలు ఉన్నత ఆశ్రమ పాఠశాలను సందర్శించిన MHBD కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఉన్నత ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ను జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే పరిశుభ్రంగా ఉండే బోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాల ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.
Similar News
News January 6, 2026
SRPT: గత ఎన్నికల్లో BRS హవా.. ఈసారి..

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారాకు ముందే రాజకీయం వేడెక్కింది. HNR, KDD, SRPT, NDCL, తిరుమలగిరి మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో BRS ఈ 5 స్థానాలను కైవసం చేసుకోగా, ఈసారి ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పార్టీలు సమరానికి సిద్ధమవుతున్నాయి.
News January 6, 2026
హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

TG: హైదరాబాద్‌లో రూ.4,263 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్-2 నిర్మాణం త్వరలో ప్రారంభం కానుంది. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట వరకు 18.15 KM ప్రాజెక్టులో 11.52 KM స్టీల్ బ్రిడ్జి, హకీంపేట వద్ద 6 KM అండర్‌గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే భూసేకరణ, టెండర్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇందిరాపార్క్ నుంచి VST వరకు ఒక స్టీల్ బ్రిడ్జి (2.6 KM) ఉండగా, ఇది పూర్తైతే రాష్ట్రంలో రెండోది కానుంది.
News January 6, 2026
కాకినాడ: తల్లి మందలించిందని ఉరేసుకున్నాడు..!

తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పలంక మొండిలో చోటుచేసుకుంది. ఎస్ఐ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో నివసించే సంగాని సూరిబాబు ఫ్యామిలీతో ఇటీవలే గ్రామానికి వచ్చాడు. తనను తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన కుమారుడు సింహాద్రి(16) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.


