News February 7, 2025

పలు ఉన్నత ఆశ్రమ పాఠశాలను సందర్శించిన MHBD కలెక్టర్

image

మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఉన్నత ఆశ్రమ పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్స్, ఏకలవ్య మోడల్ స్కూల్స్‌ను జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే పరిశుభ్రంగా ఉండే బోజనం అందించాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాల ప్రాంతంలో పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.

Similar News

News March 28, 2025

ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఏపీ ప్రొఫెసర్

image

APకి చెందిన ఫిజిక్స్ ప్రొఫెసర్, VSU వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాస రావు ప్రపంచ దిగ్గజ శాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. ప్రపంచంలోని టాప్ 2% శాస్త్రవేత్తలలో ఒకరిగా ఆయన నిలిచినట్లు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో వెల్లడైంది. భౌతిక శాస్త్ర రంగానికి ఆయన చేసిన కృషికి దక్కిన ఫలితం ఇది. ఆయన వివిధ అంతర్జాతీయ జర్నల్స్‌కు 250కి పైగా శాస్త్రీయ వ్యాసాలు రాసి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు.

News March 28, 2025

భార్యను తీసుకురావడానికి వెళ్తూ.. భర్త మృతి

image

భార్యను ఇంటికి తీసుకురావడానికి బైక్ పై వెళ్తూ.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందిన ఘటన సత్తుపల్లి పట్టణం శివారులో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన మట్ల వెంకటేశ్వరరావు (35) భార్య భవాని సత్తుపల్లిలోని జీవి మాల్‌లో పనిచేస్తుంది. ఆమెను ఇంటికి తీసుకెళ్లేందుకు వస్తుండగా ఓ పానీపూరి బండిని ఢీకొట్టాడు. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News March 28, 2025

పార్వతీపురం జిల్లాలో భానుని ప్రతాపం

image

పార్వతీపురం మన్యం జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. పాచిపెంట, సాలూరు, భామినిలో సహా మిగిలిన మండలాలో రాబోయే 48 గంటలు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కానుంది. దీంతో ఆ మండల వాసులు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.

error: Content is protected !!