News December 4, 2024

పలు మెట్రో రైళ్లు మెట్టుగూడ వరకే..!

image

HYDలో మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో మెట్రో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాయదుర్గం నుంచి నాగోల్ వరకు డైరెక్ట్ మెట్రో సేవలకు బదులుగా, రాయదుర్గం నుంచి మెట్టుగూడ వరకు పలు రైళ్లను నడుపుతోంది. మెట్టుగూడ నుంచి తిరిగి రిటర్న్ రాయదుర్గం వెళ్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News October 23, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌లో నో బ్యాలెట్.. ఓన్లీ EVM!

image

EVMల ద్వారానే జూబ్లీహిల్స్ బైపోల్ నిర్వహిస్తామని HYD జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన అనంతరం 81 మంది అభ్యర్థులకు ఆమోదం లభించింది. రేపు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇంకెవరైనా ఉపసంహరణకు వెళితే అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే, 64 మందికి పైగా పోటీలో ఉంటే M3 ఈవీఎంలు ఉపయోగించనున్నారు.

News October 23, 2025

సికింద్రాబాద్: ప్రయాణికులతో ‘పరిచయ కార్యక్రమం’

image

తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీలో పని చేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. డీఎం సరితా దేవి ఆదేశంతో ఈరోజు కండక్టర్, వీబీఓ గోపు శ్రీనివాస్ సికింద్రాబాద్ టు వర్గల్ బస్ ప్రయాణికులతో పరిచయం చేసుకున్నారు. రూట్ వివరాలు, సమయ పట్టిక, ఆర్టీసీ ఆఫర్స్, సేవలు, సోషల్ మీడియా, సైట్లపై వివరించారు.

News October 23, 2025

పోచారంలో కాల్పులు.. CP క్లారిటీ

image

పోచారంలో‌ కాల్పుల ఘటనపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. పాతకక్షల కారణంగా జరిగిన దాడి అంటూ స్పష్టం చేశారు. ‘ప్రశాంత్‌ చెప్పిన ప్లేస్‌ అయిన టీ స్టాల్ వద్దకు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ వచ్చారు. ఇంతకుముందే వీళ్లకు ఇంటరాక్షన్ ఉంది. ఇబ్రహీంకు ప్రశాంత్ వల్ల రూ.కోటి నష్టం జరిగింది. ఇదే బుధవారం సాయంత్రం కాల్పులకు దారి తీసింది. నిందితులను అరెస్ట్ చేశాం. ఒకరు పరారీలో ఉన్నారు’ అని CP తెలిపారు.