News July 30, 2024
పలు శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష

గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గిరిజనుల స్థితిగతులు, వారి అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, గిరిజన హాస్టల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరోవైపు గంజాయి కట్టడిపై సీఎం చర్చిస్తున్నారు.
Similar News
News October 26, 2025
గుంటూరులో నాన్ వెజ్ ధరలు ఇవే..!

గుంటూరులో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220, స్కిన్‌తో రూ. 200కి విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900 వద్ద స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ.440, రాగండి రూ.170, బొచ్చ రూ.220గా ఉంది. చేపలను కొనుగోలు చేయడానికి నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News October 26, 2025
తెనాలి: చంద్రబాబు, లోకేశ్‌పై పోస్టులు.. కేసు నమోదు

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై ట్విట్టర్‌లో అనుచిత పోస్ట్‌లు పెడుతున్న వ్యక్తిపై తెనాలిలో కేసు నమోదైంది. ఉపేంద్ర ధర్మ అనే హ్యాండిల్ ద్వారా పోస్ట్‌లు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పట్టణ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ సీఐ రాముల నాయక్ శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు.
News October 26, 2025
గుంటూరు: ‘ఈ సమస్యలు వస్తే కాల్ చేయండి’

గృహ హింస చట్టం 2006 అక్టోబర్ 26 అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా మహిళల రక్షణ, న్యాయం కోసం అధికారుల పర్యవేక్షణలో కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. మహిళలపై హింస, వేధింపులు, దౌర్జన్యాలు ఎదురైనప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుంటూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గృహ హింస చట్టం శాఖను సంప్రదించవచ్చు. లీగల్ కౌన్సిలర్ : 8639687689, సోషల్ కౌన్సిలర్: 8074247444.


