News April 5, 2024
పల్నాడులో చంద్రబాబు పర్యటన షెడ్యూల్

టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో పర్యటించనున్నారు. అక్కడ ప్రజాగళం సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన షెడ్యూల్ను టీడీపీ నాయకులు విడుదల చేశారు. శనివారం మధ్యాహ్నం 2.55 గంటలకు చంద్రబాబు క్రోసూరు పశువుల ఆసుపత్రి వెనుక ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటున్నారు. 3 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరుతారు. 3.10కి క్రోసూరులోని ఎన్టీఆర్ సెంటర్ వద్ద సభలో ప్రసంగిస్తారు.
Similar News
News December 9, 2025
21న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం: కలెక్టర్

ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమం పై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో జరిగింది. ప్రచార పోస్టర్లను ఆవిష్కరించి కలెక్టర్ మాట్లాడారు. 5 సం.ల లోపు వయస్సు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె. విజయ లక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
News December 9, 2025
గుంటూరు జిల్లా డీఈఓగా సలీం బాషా

గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారిగా (డీఈఓ)గా షేక్ సలీం బాషా నియమితులయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా డీఈఓగా, కృష్ణాజిల్లా DIET కళాశాల ప్రిన్సిపల్గా ఉన్న ఆయనను గుంటూరు బదిలీ చేస్తూ మంగళవారం విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా గుంటూరు డీఈఓ రేణుకను ప్రకాశం జిల్లా డీఈఓగా బదిలీ చేస్తూ విద్యాశాఖ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు.
News December 9, 2025
విద్యార్థుల గళంపై కూటమి ఉక్కుపాదం మోపుతుంది: YCP

విద్యార్థుల గళంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని YCP ‘X’లో పోస్ట్ చేసింది. YCP స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు చైతన్యపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారని రాసుకొచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే కేసులా చంద్రబాబు, లోకేశ్ అంటూ ప్రశ్నించారు.


