News February 15, 2025
పల్నాడులో బర్డ్ ఫ్లూ లేదు: కాంతారావు

జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడం లేదని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కాంతారావు తెలిపారు. కోళ్ల ఫారాలను పశుసంవర్ధక శాఖ సిబ్బంది సందర్శించి సంబంధిత యజమానులకు బయో సేఫ్టీ, బయో సెక్యూరిటీ విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటికే 28 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కోళ్ల రవాణా విషయంలో చెక్ పోస్ట్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.
Similar News
News March 27, 2025
జడ్పీ కోఆప్షన్ మెంబర్‌గా మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్

ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్‌గా వైసీపీ నేత మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం కర్నూలులోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్‌తో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి పీ.రంజిత్ బాషా ప్రమాణ స్వీకారం చేయించారు. జడ్పీ ఛైర్మన్ పాపిరెడ్డి, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.
News March 27, 2025
కన్నడిగులకు మరో షాక్!

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. పాల ధరలను లీటరుకు రూ.4 పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిల్క్ ధరలను లీటరుకు రూ.5 పెంచాలని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) కోరగా సీఎం సిద్దరామయ్య రూ.4 పెంచేందుకు అంగీకరించారు. ఇటీవలే అక్కడ కరెంట్ ఛార్జీలను పెంచారు. 6 గ్యారంటీలే ధరల పెరుగుదలకు కారణమని విపక్షాలు మండిపడుతున్నాయి.
News March 27, 2025
గూడూరులో డెడ్ బాడీ కలకలం

గూడూరు పట్టణ శివారులోని టిడ్కో ఇళ్ల సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం ఇవాళ కలకలం రేపింది. టిడ్కో గృహాల పక్కనే ఉన్న కంపచెట్ల పొదల్లో ఓ మృతదేహం కుళ్లిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారం రోజుల క్రితం ఓ మహిళ తన కుమారుడు సోహెల్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉన్నారు. పోలీసులు సోహెల్ మృతదేహంగా అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.