News February 27, 2025

పల్నాడులో 30 శాతం పోలింగ్ నమోదు

image

పల్నాడు జిల్లాలో గురువారం కృష్ణా-గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలలో మధ్యాహ్నం 12 గంటలకు 30 శాతం పోలింగ్ నమోదైంది. వారిలో పురుషులు 11,942 మంది, మహిళలు 5,387 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ట్రాన్స్ జెండర్స్ ఎవరు ఓటింగ్‌కు రాలేదు. జిల్లాలో మొత్తంగా 30 శాతం ఓటింగ్ నమోదు కాగా 17,329 మంది పట్టభద్రులు తమ ఓట్లు వేశారు. కలెక్టర్ అరుణ బాబు పోలింగ్‌ను పరిశీలిస్తున్నారు. 

Similar News

News March 19, 2025

వికారాబాద్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఈఓ రేణుకాదేవి తెలిపారు. ఏలాంటి ఇబ్బందులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్‌ 08416 235245కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పారు. 

News March 19, 2025

పాకిస్థాన్‌లో చైనా ఆర్మీ..!

image

పాకిస్థాన్‌లో ఆర్మీ, ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించేలా చైనా ఒప్పందం చేసుకుంది. సీపెక్ ప్రాజెక్టులోని చైనా కార్మికులని, ఇంజినీర్లను కాపాడేందుకు వీలుగా ఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందంతో డ్రాగన్ దేశానికి చెందిన పలు భద్రతా ఏజెన్సీలు పాక్‌లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షిస్తాయి. పాక్‌లో బలూచిస్థాన్ వేర్పాటు వాదుల దాడుల నేపథ్యంలో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News March 19, 2025

శ్రీకాకుళంలో దంచి కొడుతున్న ఎండలు

image

శ్రీకాకుళం జిల్లాలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో శ్రీకాకుళం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు, పాదచారులు చాలాచోట్ల మజ్జిగ, పండ్ల రసాలు తాగుతున్నారు. మరో రెండు నెలలు జిల్లాలో ఎండల తీవ్రంగా ఉంటే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు  సూచిస్తున్నారు. చిన్నారుల, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.

error: Content is protected !!