News May 20, 2024
పల్నాడు అల్లర్లపై డీజీపీకి అందించిన నివేదికలో వివరాలివే..
ఎన్నికల రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లపై సిట్ బృందం నివేదిక రూపొందించి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందించింది. పల్నాడు జిల్లాలో మొత్తం 22 కేసులు నమోదు అయినట్లు పేర్కొంది. 581 మందిపై కేసు నమోదు చేసి, 19 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. 91 మందికి 41A నోటిసులు జారీ చేసినట్లు తెలిపారు. మరికాసేపట్లో నివేదికను సీఈవో, సీఈసీకి పంపనున్నట్లు తెలుస్తుంది.
Similar News
News December 7, 2024
గుంటూరులో థాయ్‌లాండ్ అమ్మాయిలతో వ్యభిచారం.!
గుంటూరు లక్ష్మీపురంలోని స్పా సెంటర్‌లో జరుగుతున్న వ్యభిచార గుట్టు పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందడంతో ఒకే సారి 17 సెంటర్లపై ఏఎస్పీ సుప్రజ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో థాయ్ లాండ్‌కి చెందిన నలుగురు, నార్త్ ఇండియాకి చెందిన ముగ్గురు, మరో స్పా సెంటర్‌లో ఏడుగురు యువతులు, ముగ్గురు విటులు, ఆయా సెంటర్ల నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్నారు.
News December 7, 2024
కేంద్రీయ విద్యాలయాల ఆమోదం పట్ల ఎంపీ లావు హర్షం
దేశ వ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించిందని ఎంపీ లావు కృష్ణదేవరాయలు అన్నారు. ఇందులో పల్నాటి వాసులు ఎంతగానో ఎదురు చూస్తున్న రొంపిచర్ల, మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో కేంద్రియ విద్యాలయాలకు ఆమోదం లభించి, ప్రారంభానికి లైన్ క్లియర్ అయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News December 7, 2024
గుంటూరు: కలెక్టర్ల సమావేశానికి ఏర్పాట్లు పరిశీలన
ఈనెల 10,11 తేదీలలో వెలగపూడి సచివాలయం వద్ద జరిగే జిల్లా కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ నాగలక్ష్మీ పరిశీలించారు. సీటింగ్ ఏర్పాట్లు, అకామడేషన్ ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. వెహికల్ పార్కింగ్, సెక్యూరిటీ, భోజన ఏర్పాట్ల గురించి ఆమె స్థానిక అధికారులతో మాట్లాడారు. డ్యూటీలు కేటాయించిన అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ చెప్పారు.