News September 16, 2024
పల్నాడు: ‘ఆక్రమణల తొలగింపుకు కూటమి ప్రభుత్వం చర్యలు’

ఆక్రమణలు తొలగింపుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టడం హర్షణీయమని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కోకన్వీనర్ పెంటేల బాలాజీ చెప్పారు. సోమవారం చిలకలూరిపేట జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాలలో వైసీపీ విచ్చలవిడిగా చెరువులు కాలవలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఆక్రమణల వలన జరిగే నష్టానికి ప్రస్తుత వరదలు ఉదాహరణ అని చెప్పారు. వెంటనే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలని కోరారు.
Similar News
News October 15, 2025
తెనాలిలో పెరుగుతున్న క్రైమ్ రేటు!(1/2)

ప్రశాంతంగా ఉంటున్న తెనాలిలో పరిస్థితి 3 మర్డర్లు..6 చోరీలు అన్నట్లుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. గత 7 నెలల కాలంలో వేర్వేరు కారణాలతో ఏడుగురు హతమయ్యారు. చెంచుపేటలో ఇవాళ జరిగిన హత్య లాగానే కొన్ని నెలల క్రితం పండ్ల వ్యాపారిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. తర్వాత ముత్తింశెట్టిపాలెంలో మహిళ హత్య, పరిమి రోడ్డులో డబుల్ మర్డర్, పినపాడులో ఒకటి, వార్ఫ్ రోడ్డులో ఇంకో హత్య జరిగాయి.
News October 15, 2025
తెనాలిలో హెచ్చుమీరుతున్న నేరాలు…(2/2)

తెనాలి చెంచుపేటలో మంగళవారం పట్టపగలే హోటల్ వద్ద టిఫిన్ తింటున్న కోడితాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావుని పాత కక్షలతో దారుణంగా హత్య చేశారు. ఇలా వరుస హత్యోదంతాలతో పాటు తరచూ జరుగుతున్న చోరీలు, కొట్లాటలు తెనాలి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం రౌడీషీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మళ్లీ అదే తరహాలో నేర తీవ్రతను తగ్గించడానికి పోలీసులు నిఘా మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
News October 15, 2025
గుంటూరు: ఆటో డ్రైవర్కు మూడు నెలల జైలు శిక్ష

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ కోటి వెంకట రెడ్డికి గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు మంగళవారం 3 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. 2016లో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు సాక్ష్యాలను సమర్పించడంతో నిందితుడు దోషిగా తేలాడు. విచారణలో ఎస్ఐ అమీర్, ఏపీపీ శౌరి కృషి చేశారు. ఎస్పీ పోలీసులను అభినందించారు.