News April 22, 2024
పల్నాడు: ఆరుబయట నిద్రిస్తున్న మహిళ దారుణ హత్య

ఆరుబయట నిద్రిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన రెంటచింతల మండల పరిధిలోని తుమృకోటలో, సోమవారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన కుంకలకుంట భారతి గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఆదివారం గ్రామానికి వచ్చారు. రాత్రి ఆరు బయట పడుకోగా తెల్లవారేసరికి హత్యకు గురైందని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 21, 2025
నేడు గుంటూరులో చెక్కుల పంపిణీ

గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణలో భాగంగా భూ సేకరణకు అంగీకరించిన యజమానులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. కేంద్ర సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై యజమానులకు నష్టపరిహారం చెక్కులను అందజేస్తారు. ఇందుకోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
News April 20, 2025
కొల్లిపర: ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య

కొల్లిపర మండలం గుడిబండి వారిపాలెంకి చెందిన గుంటూరు రత్న కుమారి (22) ఆదివారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కొల్లిపరలోని గవర్నమెంట్ హాస్పటల్కి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్ సుప్రియ నిర్ధారించారు. తెనాలి సీఐ ఆర్.ఉమేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : DEO

ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు DEO సి.వి రేణుక తెలిపారు. ఈ నెల 28 నుంచి మే 15 వరకు https://cse.ap.gov.in వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఐదేళ్ళు నిండిన వారికి ప్రస్తుతం 1వ తరగతికి అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. ఎంపిక రాష్ట్రస్థాయిలో ఉంటుందని, మే 16 నుంచి 20 వరకు వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారని చెప్పారు.