News December 9, 2024
పల్నాడు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!
పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయస్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.
Similar News
News December 27, 2024
హెల్మెట్ ధరించటం భారం కాదు బాధ్యత: ఎస్పీ
పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో వాహనదారులకు నిర్వహించిన హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో హెల్మెట్ తలకు రక్షణగా ఉంటుందని తెలిపారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులను గులాబీలతో అభినందించారు. ఈ కార్యక్రమంలో సీఐ నారాయణస్వామి, ఎస్ఐ మేరాజ్ తదితరులు పాల్గొన్నారు.
News December 27, 2024
కొండవీడు కోట చరిత్ర మీకు తెలుసా?
పల్నాడు జిల్లా యడ్లపాడు(M) కొండవీడు గ్రామ పరిధిలో ప్రఖ్యాతి చెందిన కొండవీడు కోట ఉంది. ఇది గుంటూరు నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెడ్డిరాజులు 1325 నుంచి 1425 వరకు ఈ కోటను రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు. 14వ శతాబ్దంలో నిర్మించిన ఈ కోటలో 21 నిర్మాణాలు ఉన్నాయి. అయితే వాటిలో చాలా వరకూ శిథిలావస్థలో ఉన్నాయి. కానీ నేటికీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోందని ఆ చుట్టుపక్కల ప్రాంత వాసులు తెలిపారు.
News December 27, 2024
తాడేపల్లిలో రైల్వే కోడూరు కానిస్టేబుల్ మృతి
రైల్వే కోడూరుకు చెందిన కానిస్టేబుల్ రాజయ్య గురువారం తాడేపల్లిలో మృతి చెందాడు. సీఎం క్యాంప్ కార్యాలయానికి 15 రోజుల క్రితం డ్యూటీ నిమిత్తం గుంటూరు జిల్లా తాడేపల్లికి వెళ్లారు. డ్యూటీలో అస్వస్థతకు గురవ్వగా.. గురువారం చికిత్స నిమిత్తం మణిపాల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్టు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.