News December 9, 2024

పల్నాడు: ఆ నలుగురి చివరి ఫొటో ఇదే..!

image

పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా కావలి పట్టణ వాసులు నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే. ఆంజనేయస్వామి మాల వేసుకున్న వీరంతా తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి వెళ్లారు. దర్శనం తర్వాత తిరిగి వస్తుండగా కారు చెట్టు ఢీకొని చనిపోయారు. కొండగట్టులో వాళ్లు తీసుకున్న చివరి ఫొటో ఇదే. ఎంతో ఆనందంగా గడిపిన వాళ్లు కన్నుమూయడంతో బంధువులు బోరున విలపిస్తున్నారు.

Similar News

News January 21, 2025

గుంటూరు పట్టణంలో భారీ పేలుడు

image

గుంటూరులోని బ్రాడీపేట ఆరోలైను 18వ అడ్డరోడ్డు వద్ద సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఒక ఇంట్లో నుంచి వచ్చిన పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ప్రమాదంలో ఇంటి యజమాని గన్ సైదా 8ఏళ్ల కుమార్తె గాయపడింది. విద్యుత్ఘాతంతో పేలుడు సంభవించిందని క్లూస్ టీం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. పట్టాభిపురం పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇళ్లల్లో తనిఖీలు చేయగా పేలుడు పదార్థాలేమీ లభ్యం కాలేదు.

News January 21, 2025

హౌసింగ్ లే అవుట్స్ లక్ష్యాలను అధిగమించాలి: కలెక్టర్

image

హౌసింగ్ లే అవుట్స్‌లో ప్రతీవారం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులు సోమవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంక్ లింకేజీ రుణాలు అందించేలా చూడాలని చెప్పారు. 

News January 21, 2025

గుంటూరు: దేహదారుడ్య పరీక్షల్లో 362 మంది ఉత్తీర్ణత 

image

గుంటూరు పోలీస్ కవాత్ మైదానంలో జరుగుతున్న కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుడ్య పరీక్షల్లో సోమవారం 362 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 680 మంది అభ్యర్థులు పరీక్షల్లో పాల్గొన్నారు. ధృవపత్రాలు సక్రమంగా లేకపోవడంతో 102 మంది ఆరంభంలోనే వెనుదిరిగారు. చివరికి 578 మంది అభ్యర్థులకు పలు అంశాల్లో పరీక్షలు నిర్వహించగా 362 మంది ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణత పొందారు. ఎస్పీ సతీశ్ కుమార్, అదనపు ఎస్పీలు పర్యవేక్షించారు.