News May 19, 2024

పల్నాడు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకేశ్

image

పల్నాడు జిల్లా కలెక్టర్‌గా లత్కర్ శ్రీకేశ్ బాలాజీ రావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు పని చేసిన శివ శంకర్ బదిలీ కావడంతో నూతన కలెక్టర్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన నూతన కలెక్టర్‌ను జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్, కలెక్టరేట్లోనే వివిధ విభాగాల అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడు జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ, సహకారాలు అందిస్తారని బాలాజీ తెలిపారు.

Similar News

News April 23, 2025

పదో తరగతి పరీక్షల్లో ఆటో డ్రైవర్ కుమార్తె టాపర్

image

తెనాలి(M) సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన మద్దినేని మనోజ్ఞ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సత్తా చాటింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో చదువుతున్న మనోజ్ఞ 591 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో టాపర్‌గా నిలిచారు. సర్కార్ బడిలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన మనోజ్ఞను పలువురు అభినందించారు. మనోజ్ఞ తండ్రి మధుబాబు ఆటో డ్రైవర్ వృత్తిలో ఉన్నారు. ఐఐటీలో చదవాలన్నది తన లక్ష్యమని మనోజ్ఞ తెలిపారు.

News April 23, 2025

టెన్త్ ఫలితాల్లో అద్భుతంగా రాణించిన గుంటూరు

image

గుంటూరు జిల్లా పదో తరగతి పరీక్షల్లో అద్భుతంగా రాణించింది. రెగ్యులర్ విద్యార్థులలో 27,255 మంది పరీక్ష రాయగా, 24,169 మంది ఉత్తీర్ణత సాధించి 88.53 శాతంతో రాష్ట్రంలో నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది ఉత్తీర్ణత 86.69శాతంతో 16వ స్థానంలో నిలిచింది. ఈసారి ఏకంగా 12 స్థానాలు మెరుగుపర్చుకుని 4వ స్థానంలో నిలవడం విశేషం.

News April 23, 2025

10th RESULTS: 4వ స్థానంలో గుంటూరు జిల్లా

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 27,255 మంది పరీక్ష రాయగా 24,129 మంది పాసయ్యారు. 14444 మంది బాలురులో 12567 మంది, 12811 మంది బాలికలు పరీక్ష రాయగా 11562 మంది పాసయ్యారు. 88.53 పాస్ పర్సంటైల్‌తో జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో నిలిచింది.

error: Content is protected !!