News March 12, 2025

పల్నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత

image

స్థానిక పల్నాడు కలెక్టరేట్ వద్దకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. యువత పోరులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలు, శ్రేణులతో కలిసి కలెక్టరేట్ లో వినతి పత్రం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో ఆ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

Similar News

News November 28, 2025

ఖమ్మం: 15 మంది నోడల్ అధికారుల నియామకం

image

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 13 విభాగాలుగా విభజించి 15 మంది నోడల్ అధికారులను నియమించారు. వీరందరికీ గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎన్నికల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు గాను వీరిని నియమిస్తూ ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 15 మంది ఒక్కో రకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

News November 28, 2025

అమీన్ పీర్ దర్గాలో ‘రాజు వెడ్స్ రాంబాయ్’ టీమ్ సందడి

image

కడప పెద్ద దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర బృందం శుక్రవారం దర్శించుకుంది. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, నిర్మాత రాహుల్, డైరెక్టర్ సాయిల్, విక్రమ్, చైతన్య తదితరులు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సినిమా హిట్ కావడం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

News November 28, 2025

విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత

image

తిరుమల గర్భాలయంపై ఉన్న గోపురాన్ని ఆనంద నిలయ విమానం అంటారు. ఈ గోపురంపై కొలువై ఉన్న స్వామివారి రూపమే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. విమానం అంటే కొలవడానికి వీలుకాని అపారమైన శక్తి కలిగినది అని అర్థం. ఇది భక్తులకు నేరుగా వైకుంఠవాసుడిని చూసిన అనుభూతినిస్తుంది. ఈ గోపురంలో మొత్తం 60 మంది దేవతా మూర్తులు ఉంటారు. ఈ స్వామిని దర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>