News July 3, 2024
పల్నాడు: కుమారుడి మృతి.. తండ్రి కోసం ఎదురుచూపు

రాజుపాలెం మండలం ఉప్పలపాడుకి చెందిన కస్తూరి మహేశ్ (30) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు. అతని తండ్రి సాంబయ్య సోమవారం పెన్షన్ తీసుకుని పనిమీద ఊరు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళాడు. అయితే అతను వెళ్లిన మరుసటిరోజు కొడుకు చనిపోగా.. తండ్రికి కొడుకు మరణవార్త తెలియకపోవడంతో అంత్యక్రియలు చేయకుండా తండ్రి కోసం ఎదురుచూస్తున్నారు. ఫొటోలో తెల్లచొక్కాతో ఉన్నది కనిపించని తండ్రి, కారులో చనిపోయిన కొడుకు.
Similar News
News October 29, 2025
నాలుగు నెలల్లో రైతుల ఫ్లాట్లు పంపిణీ చేస్తాం: మంత్రి నారాయణ

అమరావతి రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. సచివాలయంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇది ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించే చర్య అని మండిపడ్డారు. రాబోయే నాలుగు నెలల్లో రైతులందరికీ ప్లాట్ల రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
News October 29, 2025
రేపటి నుంచి యధావిధిగా పాఠశాలలు: డీఈవో

జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు గురువారం నుంచి యధావిధిగా పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి సీవీ రేణుక తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను మండల విద్యాశాఖ అధికారులకు పంపించారు. ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ముందుగానే పాఠశాలలకు వెళ్లి అక్కడ పరిస్థితులు గమనించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. పాఠశాల ప్రాంగణంలో శానిటేషన్ పనులు చేయించాలని సూచించారు.
News October 29, 2025
తుళ్లూరులో ఈ నెల 31 జాబ్ మేళా

అమరావతి రాజధాని ప్రాంతంలో 380కి పైగా ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు CRDA కమిషనర్ కన్నబాబు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి & శిక్షణ శాఖ ఆధ్వర్యంలో CRDA సౌజన్యంతో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరు స్కిల్ హబ్‌లో జాబ్ మేళా ప్రారంభం అవుతుందని చెప్పారు. 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు.


