News February 9, 2025
పల్నాడు: కేజీ చికెన్ ధర ఎంత అంటే.!

పల్నాడు జిల్లాలో గతవారంతో పోల్చుకుంటే ఈ వారం చికెన్ ధరల్లో రూ.10-20ల వరకు తగ్గాయి. కేజీ ధర చికెన్ స్కిన్ లెస్ రూ.260గా ఉంది. స్కిన్‌తో రూ.240లుగా విక్రయిస్తున్నారు. లైవ్ కోడి రూ.132, మటన్ ధర కేజీ రూ.900లుగా ఉంది. కోడిగుడ్లు రూ.4.75 నుంచి రూ.5ల వరకు విక్రయిస్తున్నారు. కాగా మటన్ ధరలో గత వారంతో పోలిస్తే ఏ మార్పు లేదు.
Similar News
News October 21, 2025
అమరవీరుల స్తూపానికి సైబరాబాద్ సీపీ నివాళి

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు కొండాపూర్‌లో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి అమరవీరుల స్మారకానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 191 మంది పోలీసు సిబ్బందిని స్మరించారు. రక్తదాన శిబిరాలు, వ్యాసరచన పోటీలు, విద్యార్థుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ జోన్ డీసీపీలు, అధికారులు పాల్గొన్నారు.
News October 21, 2025
GNT: తవ్వకాల్లో బంగారం దొరికిందని.. రూ.12లక్షలు స్వాహా

తవ్వకాల్లో బంగారం దొరికిందని చెప్పి నకిలీ బంగారాన్ని విక్రయించిన కర్ణాటకకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరండల్ పేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వెస్ట్ డీఎస్పీ అరవింద్ వివరాల ప్రకారం.. ఐదుగురు సభ్యుల ముఠా నగరానికి చెందిన దంపతులను నమ్మించి రాగి-జింక్ మిశ్రమంతో కూడిన అరకేజీ నకిలీ బంగారం ముక్కలు ఇచ్చింది. వారి నుంచి రూ.12 లక్షలు తీసుకుని ఉడాయించారు. కేసు దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకున్నారు.
News October 21, 2025
18 మండలాలలో 59 గ్రామాల ఎంపిక: కలెక్టర్

ఎస్సీలు అధికంగా ఉన్న గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం అన్నారు. జిల్లాలోని 18 మండలాలలో 59 గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఒక్కొక్క గ్రామానికి కేంద్ర ప్రభుత్వం రూ.20 లక్షల నిధులను కేటాయించిందన్నారు. ఎంపిక చేసిన గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు సూక్ష్మ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అభివృద్ధి పనులపై ఎండీఓల పర్యవేక్షణ ఉండాలని సూచించారు.