News June 13, 2024
పల్నాడు జిల్లాకు దక్కని మంత్రి పదవి.. కారణం?

పల్నాడు జిల్లా లోక్‌సభ స్థానంతోపాటు 7 అసెంబ్లీ స్థానాల్లో TDP ఎన్నడూ లేనివిధంగా మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఆశావహులైన సీనియర్లకే ఇక్కడ నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది. వారిలో కన్నా, యరపతినేని, జీవీలకు ఈసారి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని భావించారు. కాగా ప్రత్తిపాటి, జూలకంటి ఆశావహుల జాబితాలో ఉన్నారు. వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం పల్నాడుకు ప్రాతినిధ్యం కల్పించలేకపోయింది.
Similar News
News March 25, 2025
తుళ్లూరు: జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు

పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం మైనారిటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి కే. హర్షవర్ధన్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈనెల 27వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలో ఎంజీ రోడ్డులో ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించేందుకు నిర్ణయించారు.
News March 25, 2025
భూసమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి: మంత్రి అనగాని

భూసమస్యలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులను మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. వెలగపూడిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ భూములు 22ఏలో ఉండకూడదన్నారు. పేదలకు న్యాయం చేయాలన్నదే సీఎం చంద్రబాబు తపన అని, 22ఏ, ఫ్రీహోల్డ్ భూములపై ప్రత్యేక డ్రైవ్- భూవివాదాలు పరిష్కారంపై కలెక్టర్లు శ్రద్ధ చూపాలని సూచించారు.
News March 25, 2025
GNT: విడదల రజనిని అరెస్ట్ చేస్తారా..?

చిలకలూరిపేటకు చెందిన మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని అరెస్టు కానున్నారా? అనే విషయంపై పొలిటికల్ సర్కిల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2 కోట్ల నగదు అక్రమంగా వసూలు చేసినట్లు ఇప్పటికే ఆమెపై కేసు నమోదు అయింది. ఎంపీ కృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, మర్రి రాజశేఖర్ వంటి కీలక నేతలు ఆమెపై వరుస పెట్టి ఆరోపణలు చేస్తుండటం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.