News April 3, 2025
‘పల్నాడు జిల్లాకు మొదటి ప్లేస్’

రాష్ట్రంలో నే సొసైటీల కంప్యూటర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా సహకార శాఖ అధికారి ఎం.వెంకటరమణ అన్నారు. మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని సొసైటీలు గో లైవ్ లోకి వచ్చాయని వివరించారు. సభ్యులకుపారదర్శకంగా సేవలు అందించాలని తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీల సీఈఓలు, జిల్లా అధికారి వెంకటరాముడు కంప్యూటర్ రిజిస్ట్రేషన్ కోఆర్డినేటర్ అనిల్ రాజ్ కుమార్ను సన్మానించారు.
Similar News
News November 19, 2025
వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంది: కలెక్టర్

వయోవృద్ధులకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షామీర్పేటలోని రుద్రమదేవి ఓల్డ్ హోమ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వయోవృద్ధుల కోసం ప్రత్యేక సంక్షేమ చట్టం ఉందని, తల్లిదండ్రులను సరిగా చూసుకోని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.

HYD: 18 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్

నవంబర్ 12 నుంచి 18వరకు జరిగిన ఆపరేషన్లో 11కేసులను ఛేదించి దేశ వ్యాప్తంగా 18మందిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ట్రేడింగ్ మోసాలను కట్టడి చేస్తూ 15మందిని పట్టుకున్నారు. హెటెరో కంపెనీపై 250 మిలియన్ డాలర్ల భారీ ఎక్స్టోర్షన్కు ప్రయత్నం చేసిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నకిలీ మెయిల్స్, ఫేక్ USFDA డాక్యూమెంట్లతో గ్యాంగ్ బెదిరించిందన్నారు.