News August 19, 2024
పల్నాడు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
పిడుగురాళ్లలో ఆదివారం అర్ధరాత్రి దాటాక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైకు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. పిడుగురాళ్లకు చెందిన మారురి నాగతేజారెడ్డి(25), ఇందూ (30), అమూల్య (15)లు గురజాలలో వివాహానికి ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నారు. టోల్ ప్లాజా సమీపంలోకి రాగానే రోడ్డుపై ఆగి ఉన్న లారీని బైకు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
Similar News
News September 19, 2024
గుంటూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్.?
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేపటితో 100 రోజుల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈ నెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్
News September 19, 2024
నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసుల పీటీ వారెంట్
బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌పై తుళ్లూరు పోలీసులు బుధవారం మంగళగిరి కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2020లో మండలంలోని వెలగపూడిలో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన రాళ్ల దాడిలో ఓ మహిళ మృతిచెందింది. అప్పట్లో ఓ సామాజిక వర్గం రోడ్డుపై బైఠాయించి నందిగం సురేశ్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని ధర్నా కూడా చేశారు. సదరు కేసుపై తుళ్లూరు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News September 19, 2024
స్వచ్ఛతా హీ సేవా సెల్ఫీ దిగిన కలెక్టర్
కలెక్టర్ అరుణ్ బాబు స్వచ్ఛతా హీ సేవకు మద్దతు తెలుపుతూ సెల్ఫీ దిగారు. ఐటీసీ బంగారు భవిష్యత్, సెర్చ్ ఎన్జీవో జిల్లా నీరు పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో ఐ సపోర్ట్ స్వచ్ఛ భారత్ అనే అంశంపై కలెక్టరేట్‌లో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. దీనిలో కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులు సెల్ఫీ దిగి తమ మద్దతు తెలిపారు. సంస్థ జిల్లా కోఆర్డినేటర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మండల స్థాయిలో తమ తోడ్పాటు అందజేస్తామని చెప్పారు.