News April 14, 2025
పల్నాడు జిల్లాలో ఇద్దరికి షైనింగ్‌స్టార్ అవార్డులు

ద్వితీయ సంవత్సరం ఇంటర్ ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం షైనింగ్ స్టార్ అవార్డులు ఇస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారిని నీలావతి దేవి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15వ తేదీన స్వయంగా ఈ అవార్డులు అందిస్తారని పేర్కొన్నారు. జిల్లా నుంచి పమ్మి కీర్తన (970 మార్కులు), జంగా కీర్తన (902 మార్కులు) ఎంపికయ్యారని నీలావతి దేవి వెల్లడించారు.
Similar News
News November 23, 2025
MHBD: రేపు ప్రజావాణి కార్యక్రమం రద్దు

నవంబర్ 24న జరిగే ప్రజావాణి కార్యక్రమం అనివార్య కారణాలవల్ల రద్దు చేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున, జిల్లా ప్రజలు ప్రజావాణి దరఖాస్థులతో సోమవారం మహబూబాబాద్ కలెక్టరేట్‌కు హాజరు కావొద్దని సూచించారు.
News November 23, 2025
ప్రొద్దుటూరు: బంగారం వ్యాపారి కేసులో కొత్త ట్విస్ట్.!

ప్రొద్దుటూరు బంగారం వ్యాపారి <<18366988>>శ్రీనివాసులు కేసులో<<>> కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరదలు పద్మజ బావ శ్రీనివాసులుపై 1 టౌన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ తిమ్మారెడ్డి వివరాల ప్రకారం.. శ్రీనివాసులు, వెంకటస్వామి కలిసి వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం కోసం ఉమ్మడిగా అప్పులు చేశారు. ఆదాయం అన్న తీసుకొని, అప్పులు తమ్మునిపై రుద్దాడు. ఈ మేరకు వెంకటస్వామి భార్య తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసిందన్నారు.
News November 23, 2025
జనగామలో బాల్య వివాహం నిలిపివేత

జనగామలోని ఓ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు ఆదివారం నిలిపివేశారు. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు వచ్చిన సమాచారం మేరకు బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, పోలీసు శాఖ, ఐసీడీఎస్ శాఖ సిబ్బంది సంయుక్తంగా వెళ్లి బాల్య వివాహాన్ని ఆపారు. జిల్లా సంక్షేమ అధికారి కోదండరాములు మాట్లాడుతూ.. బాల్యవివాహం చేయడం, సహకరించడం, ప్రోత్సహించడం, హాజరుకావడం కూడా చట్టపరంగా శిక్షార్హమని అన్నారు.


