News April 6, 2025

పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ పల్నాడు జిల్లాలో వైభవంగా శ్రీరామ నవమి ఉత్సవాలు☞ నరసరావుపేట: చికెన్ స్టాల్స్‌లో అధికారులు తనిఖీలు☞ వినుకొండ: చెరువులో మునిగి బాలుని మృతి ☞ రొంపిచర్ల: పంచముఖ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు,☞ ఎడ్లపాడు: ఆకట్టుకున్న నాటిక పోటీలు☞  పల్నాడు జిల్లాలో ఘనంగా శ్రీరాముని శోభాయాత్ర

Similar News

News November 11, 2025

కోయిలకొండ: రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు మృతి

image

కోయిలకొండ మండల పరిధిలోని దమ్మాయిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకు ఒకేసారి మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. వీరన్నపల్లికి చెందిన బలరాం (36) తన తల్లి ముత్యాలమ్మ (54)ను అనారోగ్యం కారణంగా మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి బైక్‌పై తీసుకొచ్చారు. వైద్యసేవల అనంతరం తిరిగి వెళ్తుండగా, కోయిలకొండ వైపు నుంచి వస్తున్న కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

News November 11, 2025

ఉండవెల్లి: ‘అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు’

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఈదురుపాడు గ్రామం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను టిప్పర్‌లో అక్రమంగా తెలంగాణలోకి తరలిస్తుండగా ఉండవెల్లి పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ పుల్లయ్యను అదుపులోకి తీసుకొని, వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించామని ఎస్ఐ శేఖర్ తెలిపారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 11, 2025

న్యాయవాదుల రక్షణ చట్టానికి బీఆర్‌ఎస్ మద్దతు

image

న్యాయవాదులకు రక్షణ కల్పించే చట్టం కావాలని న్యాయవాదులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తమ సంఘీభావం ఉంటుందని, ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్‌ను నెరవేర్చాలని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు డిమాండ్‌ చేశారు. మంగళవారం చలో హైదరాబాద్ పాదయాత్ర చేస్తున్న అలంపూర్ బార్ అసోసియేషన్ సభ్యులకు భీచుపల్లి వద్ద బీఆర్‌ఎస్, అఖిలపక్ష నాయకులు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు.