News April 20, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ వెల్దుర్తి: ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి
☞ వినుకొండ: ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల ప్రదర్శన
☞ ఎడ్లపాడు: అక్రమ మైనింగ్ చేస్తున్న 3JCBలు,18 ట్రాక్టర్లను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు
☞ చిలకలూరిపేట: ర్యాలీలో మాజీ మంత్రి విడుదల రజనీకి పోలీసులకు మధ్య వాగ్వాదం
☞ నరసరావుపేట: అగ్నిమాపక వారోత్సవాలు
☞ పెదకూరపాడు: సమాధుల తోటలో ఈస్టర్ ప్రార్థనలు
Similar News
News April 21, 2025
పెబ్బేరు: ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధుడి మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి వృద్ధుడు మృతి చెందిన ఘటన పెబ్బేరులో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యుగంధర్ రెడ్డి వివరాలు.. పెబ్బేరుకు చెందిన బుచ్చన్న(65) శనివారం గొర్రెలకు గడ్డి తీసుకోస్తానని చెప్పి గ్రామ శివారులోని బావిలో స్నానం చేయడానికి దిగి ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు. మృతుడి కుమారుడు రాజేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News April 21, 2025
MNCL: 184 మంది పరీక్ష రాయలేదు: DEO

మంచిర్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు మొదటి రోజైన ఆదివారం సజావుగా జరిగినట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. పదో తరగతి పరీక్షకు మొత్తం 494కి 431 మంది విద్యార్థులు హాజరైనట్లు చెప్పారు. 63 మంది పరీక్ష రాయలేదని పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షకు మొత్తం 935కి 814 మంది హాజరు కాగా 121 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.
News April 21, 2025
నాడు ‘పాకాల’.. నేడు ‘నర్సంపేట’

ప్రస్తుత నర్సంపేట నియోజకవర్గం 1956లో ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ సంస్థానంలో ఈ ప్రాంతాన్ని పాకాల నియోజకవర్గంగా పేర్కొనేవారు. మొదట్లో పాకాల తాలూకాగా తర్వాత నర్సంపేటగా రూపాంతరం చెందింది. 1952లో పాకాల ఎమ్మెల్యేగా ఏ.గోపాలరావు గెలుపొందారు. 1957లో నర్సంపేట ఎమ్మెల్యేగా కనకరత్నమ్మ గెలిచారు. దీంతో నర్సంపేట అంటే పాకాల.. పాకాల అంటే నర్సంపేటగా ప్రత్యేక గుర్తింపు ఉంది.