News April 7, 2025

పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ జిల్లాలో భారీగా ఈదురు గాలులు☞ వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు☞ చిలకలూరిపేటలో గ్రీవెన్స్ నిర్వహించిన కలెక్టర్ ☞ నరసరావుపేటలో బాలికల వసతి గృహం తనిఖీ ☞ పెదకూరపాడులో ఉచిత మెడికల్ క్యాంపులు ☞ ఎడ్లపాడు ఎస్ఐగా శివరామకృష్ణ బాధ్యతలు

Similar News

News November 15, 2025

నాగర్ కర్నూల్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో అమ్రాబాద్ మండలం వటవర్లపల్లిలో అత్యల్పంగా 12.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. వెల్దండలో 12.2, ఊర్కొండలో 12.3, కొండనాగులలో 12.4, కల్వకుర్తిలో 12.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉదయం వేళల్లో చలి కారణంగా జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News November 15, 2025

సైదాపూర్: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

image

సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని రెడ్డి అర్చన అనుమానాస్పదంగా మృతి చెందింది. శుక్రవారం కళాశాలకు వెళ్లి పరీక్ష రాసి ఇంటికి వచ్చిన అర్చన, శనివారం తెల్లవారుజామున మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 15, 2025

ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. MBNRలో ఇదీ పరిస్థితి..!

image

MBNR జిల్లాలో ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. అత్యల్పంగా బాలానగర్ మండల కేంద్రంలో 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాపూర్‌లో 11.1, గండీడ్ మండలం సల్కర్‌పేటలో 11.3, మిడ్జిల్‌లో 12.3, కోయిలకొండ సిరివెంకటాపుర్, భూత్‌పూర్‌లో 12.7, మహ్మదాబాద్‌లో 13.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.