News April 12, 2025
పల్నాడు జిల్లాలో టుడే టాప్ న్యూస్

☞ రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పల్నాడుకు 23(ప్రథమ), 9( ద్వితీయ) స్థానాలు, ☞ అమరావతి: మద్యం మత్తులో హత్యకు గురైన కోటేశ్వరరావు, ☞ నరసరావుపేట: జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల ఆందోళన, ☞ నాదెండ్ల: పురుగు మందు తాగి వృద్ధురాలు మృతి, ☞ ఈపూరు: వైన్ షాపుల్లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు, ☞మాచర్ల: రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు.
Similar News
News April 17, 2026
ఈనెల 21న అమలాపురంలో జాబ్ మేళా

ఈ నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ప్రముఖ సంస్థల్లో వివిధ ఉద్యోగాలకు SSC, ఇంటర్, ఏదైనా డిగ్రీ, ఐటిఐ, డిప్లమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలకు 8978905032ను సంప్రదించాలన్నారు.
News April 17, 2026
జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాలు యూరప్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కావాలంది. పర్యటన వివరాలు కోర్టు, CBIకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
News April 17, 2026
కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారు: మిథున్ రెడ్డి

లోక్‌సభలో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా YCP MP మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. నలుగురు కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ పట్టుబడ్డారు. అసభ్యకరమైన వీడియోలు బయటపడ్డాయి. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసిన మహిళలనే టార్గెట్ చేసి వేధిస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.


