News March 16, 2025
పల్నాడు జిల్లాలో నిలకడగా చికెన్ ధరలు

పల్నాడు జిల్లాలో చికెన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. లైవ్ కోడి కేజీ రూ.95, స్కిన్లెస్ రూ.200లు , స్కిన్‌తో రూ.180లుగా ఉంది. నాటుకోడి రూ.500ల నుంచి రూ.750ల వరకు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలలో మార్పులేదు. మటన్ ధర కేజీ రూ.1,000లుగా ఉంది. 100 కోడిగుడ్లు రూ.460-480 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో చికెన్‌కు ఆదివారం డిమాండ్ కొనసాగుతోంది.
Similar News
News December 6, 2025
పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆయనకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత కశ్మీరీ కుంకుమ పువ్వు, అస్సాంకు చెందిన ఫేమస్ బ్లాక్ టీ, మార్బుల్ చెస్ బోర్డు, మహారాష్ట్ర హస్త కళాకారులు చేత్తో చేసిన వెండి గుర్రం, ముర్షిదాబాద్‌కు చెందిన వెండి టీ కప్పుల సెట్ వంటి బహుమతులు అందజేశారు.
News December 6, 2025
ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

ఏలూరు జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కింద ఉచిత శిక్షణ అందించనున్నట్లు DLTC ప్రధానాచార్యులు భూషణం ప్రకటించారు. ఇంటర్, అంతకంటే ఎక్కువ చదివిన 15-35 ఏళ్ల లోపు యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఫీల్డ్ టెక్నీషియన్ – కంప్యూటింగ్ అండ్ పెరిఫెరల్స్ కోర్సులో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా ఏలూరులోని కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News December 6, 2025
వ్యూహ లక్ష్మి అచ్చును భక్తులందరూ చూడగలరా?

తిరుమలలో వ్యూహ లక్ష్మి దర్శన భాగ్యం అందరికీ దక్కదు. శ్రీవారిని గురు, శుక్ర వారాల్లో దర్శనం చేసుకునేవారికి మాత్రమే ఈ అరుదైన అవకాశం లభిస్తుంది. గురువారం నాడు శ్రీవారి ఆభరణాలు తొలగిస్తారు. అప్పుడు అమ్మవారిని నేరుగా చూడవచ్చు. మొదటి గడప దర్శనం అవకాశం దొరికిన వారికి వ్యూహలక్ష్మి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే శుక్రవారం రోజున అభిషేకం, నిజపాద దర్శనంలో అమ్మవారి పసుపు ముద్రను దర్శించుకోవచ్చు.


